కరెంట్‌ షాక్‌తో భర్తను ఆడుకున్న భార్య.. తీరా స్టోరీ తిప్పేసి కట్టుకథ

19 Aug, 2021 17:24 IST|Sakshi

జైపూర్‌: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు. రోజూ ఏదో ఒక విషయంపై వివాదం. దీంతో ఆ భార్యాభర్తలు ఇంట్లో ఉన్నంతసేపు గొడవ పడుతుండేవాడు. భర్త తీరుపై విసుగు చెందిన ఆమె ఎలాగైనా భర్తకు బుద్ధి చెప్పాలని భావించింది. ఈ క్రమంలోనే భోజనంలో మత్తు మందు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె శాడిజాన్ని చూపించింది. మత్తులో ఉన్న భర్త కాళ్లు కట్టేసి వరుసగా కరెంట్‌ షాక్‌ పెడుతూ వేధించింది. మత్తులో ఉన్న భర్త మెలకువ రాగానే మళ్లీ షాకిచ్చి అపస్మారక స్థితికి వెళ్లేలా చేసింది. ఇదంతా అయిపోయాక భర్త కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి కరెంట్‌ షాక్‌తో పడిపోయాడని చెప్పి ఆస్పత్రిలో చేర్పించిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. సర్దార్‌షహర్‌ ఎస్‌ఐ మణక్‌ లాల్‌ తెలిపిన వివరాల ప్రకారం..

బికనీర్‌కు చెందిన మహేంద్ర ధన్‌ తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాగొచ్చి తనను వేధిస్తున్నాడనే నెపంతో ఈనెల 17వ తేదీన మంగళవారం ఓ ప్లాన్‌ వేసింది. విధులు ముగించుకుని ఇంటికొచ్చిన భర్తకు ఆమె భోజనం వడ్డించింది. తిన్న తర్వాత భర్త అపస్మారక స్థితికి వెళ్లాడు. భోజనంలో మత్తుమందు కలపడంతో అపస్మారక స్థితిలోకి చేరిన భర్తను ఒకచోటకు జరిపింది. కొద్దిసేపటికి తేరుకున్న భర్త లేచేందుకు ప్రయత్నించగా భార్య చేతులకు గ్లౌస్‌లు కట్టుకుని నిల్చుని ఉండగా అతడి కాళ్లకు విద్యుత్‌ తీగలు కట్టేసింది. అనంతరం భర్తకు కరెంట్‌ షాక్‌ ఇచ్చింది. 

వేధింపులకు గురి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుసార్లు కరెంట్‌ షాక్‌ ఇవ్వడంతో భర్త మరోసారి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈసారి భర్త తేరుకుని చూడగా ఆస్పత్రి బెడ్‌పై ఉంది. అయితే భర్త కుటుంబసభ్యులకు విద్యుత్‌ షాక్‌ తగిలి గాయాలపాలయ్యాడని చెప్పి వారితో కలిసి భార్య అతడిని ఆస్పత్రిలో చేర్చింది. మేలుకున్న తర్వాత భర్త జరిగిన ఘోరాన్ని తన కుటుంబసభ్యులకు వివరించాడు. అర్ధరాత్రి 2గంటలకు లేచి కరెంట్‌ షాక్‌తో చిత్రహింసలకు గురి చేసిందని వాపోయాడు. భార్య చేసిన పనికి కాళ్లు కోల్పోయాడు. ఫిర్యాదు చేయడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్దార్‌ షహర్‌ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

చదవండి: బ్రేకింగ్‌.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి గాయం 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు