హృదయా విదారక ఘటన.. నాలుగేళ్ల బాలికను..

13 Aug, 2021 16:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌: రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. కొంత మంది గుర్తు తెలియని దుండగులు.. నాలుగేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి, ఆ తర్వాత అత్యాచారం చేసి హతమార్చారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జైపూర్‌లోని నరైనా గ్రామపరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నాలుగేళ్ల బాలిక గత బుధవారం ఇంట్లో ఆడుకుంటున్న తరుణంలో కనపడకుండా పోయింది. ఈక్రమంలో.. బాలిక తల్లిదండ్రులు స్థానిక నరైనా గ్రామ పరిధిలోని  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో వారు మిస్సింగ్‌ కేసును నమోదు చేశారు. బాలిక కోసం​ పోలీసులు, కుటుంబ సభ్యులు వెతకసాగారు.

ఈ క్రమంలో.. ఈ రోజు(శుక్రవారం) బాలిక మృతదేహం.. ఆమె ఇంటికి దగ్గరలోని ఒక చెరువులో లభించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, బాలిక మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా, బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారం చేసి చంపినట్లు తెలిపారు. దీంతో.. కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. బాలిక విగత జీవిగా ఉండటం చూసి కన్నీటి పర్యంత మయ్యారు. తమ కుమార్తైన  హత్యచేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాగా, దీనిపై స్పందించిన జైపూర్‌ పోలీసు అధికారి ఉమేష్‌ కుమార్‌..  నిందితులను పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు