56 కార్లను దొంగలించాడు.. పోలీసులకి వీడియో కాల్‌లో సవాల్‌

11 Jun, 2021 19:13 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

హైదరాబాద్‌: ఎంత పెద్ద దొంగైనా ఎక్కడో ఒక దగ్గర తప్ప చేసి దొరకుతాడంటారు. ఆ మాట నాకు వర్తించదు అంటున్నాడు ఈ ఘరానా దొంగ. ఇతను ఇప్పటి వరకు ఒకటి కాదు..రెండు కాదు.. 56 కార్లు చోరీ చేసినా పోలీసులకు చిక్కలేదు. పైగా దమ్ముంటే పట్టుకోండంటూ పోలీసులకే సవాల్‌ విసురుతున్నాడు. దీంతో బంజారాహిల్స్ పోలీసుల ఈ దొంగ ఆటకట్టించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  అసలు ఈ దొంగ కథేంటే చూద్దాం...

ఇప్పటివరకు 56 కార్లు..

ఇటీవల హైదరాబాద్‌ వచ్చి ఓ హోటల్‌లో బస చేసిన సినీ నిర్మాత మంజునాథ్‌ ఫార్చ్యూనర్‌ కారును చోరీ చేసింది ఇతనే. కారులో  విలువైన స్థలాలకు చెందిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. దీంతో బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పార్క్‌ హయత్‌ సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. యాప్‌ టెక్నాలజీతో కారు తాళం తీసి చోరి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండు రోజులకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ గేట్‌ నుంచి రాజస్థాన్‌ వైపు దూసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.  దీంతో అతను రాజస్తాన్‌ వాసిగా దర్యాప్తులో తేలింది. ఇక ఆ దొంగ ఆట కట్టించాలని రాజస్తాన్‌కు వెళ్లిన పోలీసులు అక్కడ అతని ఆచూకీ దొరక్క వట్టి చేతులతోనే హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది.

నన్ను మీరు పట్టుకోలేరు..
ఇలా హైదరాబాద్‌ వచ్చిన పోలీస్‌ అధికారికి ఏకంగా వాట్సప్‌ వీడియో కాల్‌ చేశాడు ఆ దొంగ. కావలంటే తన ఫోటోను స్క్రీన్‌ షాట్‌ తీసుకోమని సూచించాడు. అంతేనా…కార్ల చోరీలో తాను అనుసరిస్తున్న టెక్నాలజీతోనే తప్పించుకుకోగలుతున్నానంటూ కాలరెగరేశాడు. తనను వెతుక్కుంటూ రాజస్థాన్‌ వరకు వచ్చినవారు మీరేనంటూ అభినందించాడు. కానీ మీరు ఎన్ని చేసినా నన్ను పట్టుకోలేరని సవాల్‌ విసిరాడు. ప్రస్తుతం తమకే సవాల్‌ విసిరిన రాజస్థానీ దొంగను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

చదవండి: స్టాక్‌ మార్కెట్‌ పేరుతో మోసపోయిన నగరవాసి..!

మరిన్ని వార్తలు