కట్నం కోసం బంధువులతో అత్యాచారం.. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి డబ్బు సంపాదించే యత్నం

30 Apr, 2022 12:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అడిగినంత కట్నం ఇవ్వలేదని ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్యపై బంధువులతో కలిసి సామూహిక అత్యాచారానికి తెగపడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ మృగచేష్టలను వీడియో తీసి.. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. 

రాజస్థాన్‌ భరత్‌పూర్‌లో ఘోరం జరిగింది. అడిగినంత కట్నం తేలేదని ఓ భర్త కిరాతకానికి పాల్పడ్డాడు. లక్షన్నర రూపాయల వరకట్నం పెళ్లైన నాటి నుంచి వేధింపులు ఎదుర్కొంటోంది ఆమె. పేదింటి కుటుంబం కావడంతో కట్నం ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలో ఆమెపై లైంగిక దాడికి తెగబడింది అత్తింటి కుటుంబం. తన బంధువులతో కలిసి భర్త ఆమెను సామూహిక అత్యాచారం చేశాడు. ఆ సమయంలో లైంగిక దాడిని వీడియో కూడా తీశాడు.

కట్నం డబ్బు తేకుంటే ఆ వీడియో ద్వారా డబ్బు సంపాదించుకుంటానని ఆమెను బెదిరించాడట. ఈ మేరకు భరత్‌పూర్‌ కమాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. ‘‘నీ కుటుంబ సభ్యులు ఎలాగూ కట్నం ఇవ్వలేరూ. కనీసం ఇప్పుడు నీ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసైనా ఆ డబ్బు సంపాదించుకుంటా’’ అని ఆ మానవ మృగం బెదిరింపులకు దిగింది. దీంతో తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించిందామె.

నిందితుల్లో ఇద్దరికీ పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు అయ్యానని, మరొకరు ఆమెను ఐదురోజుల కిందట భర్త పిలుస్తున్నాడని చెప్పి కమాన్‌ ప్రాంతానికి తీసుకొచ్చి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్తోంది. అంతేకాదు పారిపోయి ఇంటికి వచ్చాక కూడా వదలకుండా నిందితులంతా ఆమెపై ఘోరానికి తెబడ్డారట. పరారీలో ఉన్న కీచకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వీడియోను ఎక్కడైనా అప్‌లోడ్‌ చేశారా? ఎవరెవరికి పంపారనే వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు.

చదవండి: ప్రియుడితో పెళ్లికి అడ్డొస్తున్నాడని తండ్రి హత్య.. ఆపై

మరిన్ని వార్తలు