పెళ్లి చేసుకోవాలని అడగడంతో మంత్రి కుమారుడి నిజ స్వరూపం బట్టబయలు

15 May, 2022 12:29 IST|Sakshi

ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేసి చివరికి తప్పించుకు తిరుగుతున్నాడు ఓ మంత్రి కుమారుడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజస్తాన్‌ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫిర్యాదులో బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది ఫేస్‌బుక్‌లో రాజస్తాన్‌ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషితో యువతికి స్నేహం ఏర్పడింది.

దాన్ని ఆసరాగా చేసుకుని గత ఏడాది జనవరి 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 17 మధ్య కాలంలో మంత్రి కుమారుడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, తనను పెళ్లి చేసుకుంటానని కూడా వాగ్దానం కూడా చేసినట్లు తెలిపింది. అయితే ఇటీవల పెళ్లి ప్రస్తావన తేవడంతో అతని నిజ స్వరూపం బయటపడిందని వాపోయింకది. పెళ్లి అన్నప్పటి నుంచి తనతో తరచూ గొడవ పడేవాడని, చివరికి తన నుంచి తప్పించుకుంటూ వస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో తెలిపింది. దీంతో ఢిల్లీలోని మంత్రికి చెందిన రెండు నివాసాలలో పోలీసులు తనిఖీ చేసినప్పటికీ అక్కడ నిందితుడు లేడు.

పరారీలో ఉన్న జోషిని పట్టుకోవడానికి అధికారుల బృందం అతని తండ్రి ఉంటున్న జైపూర్‌కు చేరుకుందని పోలీసులు తెలిపారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై మంత్రి మహేష్‌ జోషి స్పందిస్తూ, "ఈ కేసులో ఊహాగానాలు, పుకార్లు మీడియాతో సంబంధం లేకుండా పోలీసులు చట్ట ప్రకారం వారి పని చేయాలన్నారు. నిజాలు అవే బయటపడతాయని తెలిపారు.
చదవండి: మహిళా ఉద్యోగితో అనుచిత ప్రవర్తన.. జాబ్‌ రెన్యూవల్‌ కావాలంటే..

మరిన్ని వార్తలు