లాడ్జిలో భర్త రాసలీలలు: నగ్న వీడియోలు తీసిన భార్య

22 Jul, 2021 21:20 IST|Sakshi

జైపూర్‌ (రాజస్థాన్‌): ఆయనో జవాన్‌. ఇంట్లో కట్టుకున్న భార్య ఉంది. సంసారం సాఫీగా సాగుతుండగా.. భర్త ఫోన్‌ కాల్స్‌ నిత్యం మాట్లాడుతుండడం కాపురంలో చిచ్చు రేపింది. భర్తపై ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో భర్త బయటకు వెళ్లినప్పుడు నిఘా వేసింది. ఈసారి బయటకు వెళ్లిన భర్తను వెంబడించగా ఆయన ఓ లాడ్జికి వెళ్లాడు. కొద్దిసేపటికి భార్య మారుతాళంతో లాడ్జిలోని గదిని తెరిచి చూడగా నగ్నంగా భర్త, అతడి ప్రేయసి కనిపించారు. ఈ వీడియోను తీసి ఆమె పలువురికి షేర్‌ చేయడంతో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు చూసి తనను వేధిస్తున్నారని ఆ ప్రేయసి అతడి భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. 

ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ తన భార్యతో కలిసి జైపూర్‌లో నివసిస్తున్నాడు. భార్య ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. అయితే ఆమె భర్తకు ఓ ప్రేయసి ఉంది. ఆమెతో తరచూ మాట్లాడుతుండడంతో అతడి భార్యకు అనుమానం వచ్చింది. తన భర్తకు వేరొకరితో సంబంధం ఉందని గుర్తించిన ఆమె భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల భర్త ఫోన్‌లో మాట్లాడుతూ.. పలానా చోటకు రమ్మని తన ప్రేయసికి చెప్పాడు. ఇది తెలుసుకున్న భార్య కొద్దిసేపటికి భర్త వెళ్లిన లాడ్జికి వెళ్లింది. లాడ్జి నిర్వాహకులతో మాట్లాడి వారు ఉన్న గది మారుతాళం తీసుకుని పైకి వెళ్లింది. పోలీసుల సహాయంతో తాళం తెరచి చూడగా ఇద్దరూ భర్త, అతడి ప్రేయసి నగ్నంగా ఉన్నారు. ఈ దృశ్యాలను వీడియో తీసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

తీసిన వీడియోను పలువురికి పంపండంతో అవి నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. రాజస్థాన్‌లో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే ఆ వీడియోలు బయటకు రావడంతో తన పరువు పోయిందని అతడి ప్రేయసి ఉల్టా భార్యపై ఫిర్యాదు చేసింది. ఆ వీడియోలు చూసి తన బంధువులు మనస్తాపానికి గురయ్యాయని వాపోయింది. ప్రస్తుతం ఈ పంచాయితీ శాస్త్రీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు