వదినపై నలుగురితో కలిసి మరిది గ్యాంగ్‌ రేప్‌

15 Mar, 2021 22:14 IST|Sakshi

జైపూర్‌: వదినపై మరో నలుగురితో కలిసి మరిది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్తను కట్టేసి అతడి భార్యను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బరాన్‌ జిల్లాలో చోటుచేసుకుంది. భర్తతో కలిసి ఆలయానికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా ఐదుగురు అడ్డగించారు. ప్రధాన రహదారికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆలస్యంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఎస్పీ వినీత్‌కుమార్‌ తెలిపారు.

భర్తపై దాడి చేసి పక్కకు తీసుకెళ్లి కట్టేశారు. ఇక ఆ మహిళను బలవంతంగా పొదల్లోకి లాకెళ్లారు. అనంతరం అందరూ ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. భర్త కళ్లెదుటే ఆమెపై అఘాయిత్యం జరిగింది. అనంతరం బాధితురాలు తన భర్తతో కలిసి సదార్‌ పోలీసులను ఆశ్రయించింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె మొదటి భర్త కుటుంబసభ్యులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా.. ఆమెపై కక్ష కట్టి ఈ దారుణానికి పాల్పడ్డారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని ఎస్పీ వినీత్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం వారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ప్రధాన నిందితుడు దినేశ్‌గా గుర్తించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు