రాసలీలల కేసు: ‘మా అబ్బాయి చాలా మంచోడు’

19 Mar, 2021 17:15 IST|Sakshi

సీడీ కేసులో ఇద్దరి అరెస్టు

దొడ్డబళ్లాపురం/కర్ణాటక: మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో దొడ్డ తాలూకా లఘుమేనహళ్లికి చెందిన లక్ష్మిపతి (30) అనే యువకున్ని సిట్‌ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. లక్ష్మిపతి పేరు టీవీల్లో చూసిన లఘుమేనహళ్లి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ సీడీని సామాజిక కార్యకర్త కల్లహళ్లి దినేశ్‌కి ఇచ్చాడనే ఆరోపణపై అరెస్టయ్యాడు. అతని కుటుంబం లఘుమేనహళ్లిలో ఒక చిన్న సిమెంట్‌ షీట్ల ఇంట్లో నివసిస్తోంది.

తమ అబ్బాయి చాలా మంచోడని,అలాంటివాడయితే ఇలాంటి ఇంట్లో నివసించాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ ఇంట్లో కనీసం టీవీ కూడా లేదంటున్నారు. మూడు నెలల క్రితం గ్రామపంచాయతీ ఎన్నికలప్పుడు వచ్చాడని, తరువాత ఇటువైపు రాలేదని చెబుతున్నారు. ఇక పొరుగునే ఉన్న దేవనహళ్లిలో హ్యాకింగ్‌ స్పెషలిస్ట్, మాజీ విలేఖరి శ్రవణ్‌ అనే యువకున్ని కూడా ఈ కేసులో అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

చదవండి: రాసలీలల కేసు: ‘ఆ యువతి తెలుసు కానీ..’

మరిన్ని వార్తలు