‘నా చావుకు ఇంటెలిజెన్స్ సీఐ కారణం.. కుటుంబానికి ప్రాణహాని’

22 Apr, 2023 11:22 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఇంటెలిజెన్స్ సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం కరీంనగర్‌ జిల్లాలో కలకలం రేపుతోంది. చొప్పదండి మండలంలోని భూపాలపట్నం గ్రామంలో బొడిగె శ్యామ్‌ అలియాస్‌ శంభయ్య అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన చవుకు సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ సీఐ గోపాలకృష్ణ కారణమని, తన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు  ఆరోపించాడు. ఈ మేరకు సుసైడ్ నోట్‌ రాశాడు.

ఓ భూమి విషయంలో సీఐ బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నాడు. సీఐ గోపాలకృష్ణ 30 లక్షలతో భూమి కొనుగోలు చేసి.. 8 నెలల్లో రెట్టింపు కోసం టార్చర్‌ పెట్టినట్లు వెల్లడించాడు. అసభ్య పదజాలంతో తిట్టినట్లు వాపోయాడు. గోపాలకృష్ణ వేధింపులు భరించలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. సీఐ నుంచి తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందని, ఈ లేఖను జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి అందజేయాలని చెప్పాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి సూసైడ్‌ నోటును  స్వాదీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శంభయ్య మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శంభయ్య సుసైడ్‌ లేఖ ఆధారంగా పోలేసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శంభయ్య మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.
చదవండి: విధి చిన్న చూపు: కూతురు అల్లరి చూసి ఆ తల్లి మురిసిపోయింది.. అంతలోనే

మరిన్ని వార్తలు