చెప్పుల్లో బ్లూటూత్‌ పెట్టుకుని పరీక్షలు.. ధర రూ.6 లక్షలు!

27 Sep, 2021 14:09 IST|Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎంపిక కోసం నిర్వహించిన పోటీ పరీక్షలో హైటెక్‌ కాపీయింగ్‌ బట్టబయలైన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక ఓ పెద్ద కథే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే అజ్మీర్‌లోని కిషన్‌గఢ్‌లో ఒక అభ్యర్థి బ్లూటూత్ పరికరాన్ని తన చెప్పులలో దాచి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి పట్టుబడగా, ఇటువంటి ఘటనలే రాజస్తాన్‌ వ్యాప్తంగా ఆదివారం వెలుగులోకి వచ్చాయి.

దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో సహా కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ బ్లూటూత్-అమర్చిన చెప్పులు కొనుగోలుకు రూ. 6 లక్షల వరకు చెల్లించినట్లు నిందితులు తెలిపారు. భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ హైటెక్‌ మాస్‌ కాపీ తెర వెనుక ఎవరెవరూ ఉన్నారో తెలుసుకోవడానికి పోలీసులు దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన తర్వాత పరీక్షా కేంద్రాల నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న చెప్పులను తొలగించాలని అజ్మీర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: ప్రేమించిన యువతి చెల్లి అవుతుందని తెలిసి..


 

మరిన్ని వార్తలు