ప్రియుడి మోజులో పడి యువతి దారుణం.. తండ్రిని హతమార్చి ఆపై..

28 Jul, 2021 17:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: కూతురును అల్లారు ముద్దుగా పెంచాడో తండ్రి.  బిడ్డకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకోనేవాడు. ఆమెనే సర్వస్వం అనకుని బ్రతికేవాడు. చివరకు  ఆమె తను ప్రేమించిన అబ్బాయిని తీసుకొచ్చి అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనికి తన తండ్రి ఒప్పుకోలేదు. ప్రియుడి మోజులో పడి కన్నతండ్రినే అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని సంభల్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలు..సంభల్ కు చెందిన హ‌ర్పాల్ సింగ్‌కు ఒక్కగా నొక్క కుమార్తె..ప్రీతి. ఆమె గత కొద్ది కాలంగా ఓ యువకుడుని  ప్రేమిస్తోంది. అయితే ప్రియుడిని వివాహం చేసుకుంటాని తన తండ్రికి చెప్పింది. బాయ్‌ఫ్రెండ్‌తో వివాహం జ‌రిపించేందుకు హ‌ర్పాల్ సింగ్‌ నిరాక‌రించాడు. దీంతో కన్న తం‍డ్రినే క‌డ‌తేర్చింది. ముతైన్ గ్రామంలో బాధితుడు జులై 19న పొలానికి వెళ్లి స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. తరువాత అతని మృతదేహం పొలంలో ఓచెట్టుకు వేలాడుతూ కనిపించింది.

ఆయ‌నే ఆత్మహ‌త్యకు పాల్పడి ఉంటాడ‌ని కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేదు. అయితే బాధితుడి త‌ల‌పై ఇనుప‌రాడ్‌తో కొట్టడంతోనే ఆయ‌న మ‌ర‌ణించాడ‌ని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంద‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన బాలిక ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను బ‌దౌన్ జిల్లా ఇస్లాంన‌గ‌ర్‌లో అరెస్ట్ చేశామ‌ని సంభాల్ ఎస్పీ చ‌క్రేష్ మిశ్రా వెల్లడించారు. నిందితులు హ‌ర్పాల్ సింగ్‌ను హ‌త్య చేసి మృత‌దేహాన్ని చెట్టుకు వేలాడ‌దీశార‌ని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు