దారుణం: కొడుకులపై తండ్రి కాల్పులు.. ఒకరి మృతి

15 Jun, 2021 15:14 IST|Sakshi

ముంబై: ఓ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి తన ఇద్దరు కొడుకులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ కొడుకు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. పాటిల్ ఐరోలి సెక్టార్ 2 ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపారు. అయితే తండ్రితో  గొడవల కారణంగా కొడుకులు విజయ్‌, సుజయ్‌ వేరుగా నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సోమవారం సాయంత్రం పాటిల్ తన కుమారులను ఓ విషయంపై మాట్లాడటానికి తన ఇంటికి పిలిచినట్లు తెలిపారు.

అయితే తండ్రీ, కొడుకుల మధ్య కారు భీమాపై పెద్ద గొడవ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో పాటిల్ తన పిస్టల్ తీసుకొని తన ఇద్దరు కొడుకులపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక చికిత్స కోసం ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్క్నన్నారు.  అయితే విజయ్‌కి తీవ్రగాయాలు కావడంతో మరణించినట్లు తెలిపారు. కాగా అతని సోదరుడు జయ్‌కు స్వల్ప గాయాల కావడంతో ప్రాణాపాయం తప్పిందని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: ఈ రూ. 2 నాణెం ఉంటే లక్షాధికారి అయిపోవచ్చా?

మరిన్ని వార్తలు