లారీని ఢీకొన్న కారు, నలుగురు దుర్మరణం

2 Mar, 2021 06:03 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున పెనుగొండ మండలంలోని  కియా పరిశ్రమ సమీపంలో లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయిన లారీని కారు వేగంగా ఢీకొట్టింది. మృతుల్లో ఇద్దరు యవకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులంతా ఢిల్లీకి చెందినవారిగా గుర్తించారు.
చదవండి:
ఆన్‌లైన్‌ పాఠాల పేరుతో.. అశ్లీల చిత్రాలు..
ఏసీబీకి చిక్కిన సీనియర్‌ ఆడిటర్‌ 

మరిన్ని వార్తలు