రెండు లారీలు ఢీ : ఒకరు మృతి

9 May, 2022 22:46 IST|Sakshi

ఓబులవారిపల్లె: మంగంపేట జాతీయరహదారిపై ఆదివారం రెండు లారీలు ఢీ కొనడంతో డ్రైవర్‌ సుగ్రీవ్‌ సింగ్‌ (25) మృతి చెందాడు.పోలీసుల కథనం మేరకు మంగంపేట ప్రైవేట్‌ కంపెనీకి చెందిన బెరైటీస్‌ ఖనిజం సరఫరా చేసే ఏపీ 39యూబీబీ109 నంబర్‌ గల లారీ మంగంపేట గుట్టపై నుంచి వేగంగా వస్తుండగా నంద్యాల నుంచి శ్రీసీటికి మొక్క జోన్న పప్పుదినుసులు తీసుకెళ్తున్న ఏపీ04టీయూ8489 నెంబర్‌ గల లారీ ఢీ కొంది. రెండు లారీల ముందు భాగం దెబ్బతింది.

లారీలో సుగ్రీవ్‌ సింగ్‌ మృతదేహం ఇరుక్కు పోవడంతో అతి కష్టం మీద బయటకు తీశారు. క్లినర్‌ జైతూకి చెవి వద్ద గాయం కాగా తిరుపతికి తరలించారు. మరో లారీ డ్రైవర్‌ పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌ రాష్ట్రం, ధూల్‌ పూర్, చద్యాన్‌కాపురా గ్రామానికి చెందిన సుగ్రీవ్‌సింగ్‌ గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్‌ప్రదా కంపెనీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఏడాది క్రితం వివాహం జరిగింది. భార్య శివానితో రైల్వేకొడూరులో నివాసం ఉంటున్నాడు. వివాహం జరిగిన కొద్దిరోజులకే భర్త చనిపోవడంతో శివానీ, బంధువులు విలపించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరులు తెలిపారు. 

మరిన్ని వార్తలు