డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. యువకుడి మృతి 

25 Apr, 2022 22:59 IST|Sakshi

మదనపల్లె టౌన్‌: బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో.. ఓ యువకుడు మృతి చెందగా, సోదరుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె అప్పారావు తోటకు చెందిన అయూబ్‌బాషా కదిరి రోడ్డులోని నీరుగట్టువారిపల్లె టమాట మార్కెట్‌ వద్ద బిర్యానీ హోటల్‌ నడుపుతున్నాడు.

బిర్యానీకి అవసరమైన మసాలాను తీసుకురావాలని తన ఇద్దరు కుమారులు ఆరీఫ్, అమీర్‌ఖాన్‌(18)కు చెప్పాడు. వారు బైక్‌పై తీసుకెళ్తుండగా మార్గంమధ్యలోని సంఘం ఫంక్షన్‌ హాల్‌ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. వారు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అమీర్‌ఖాన్‌ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు