కాలినడక భక్తులపై దూసుకెళ్లిన లారీ

18 Jul, 2021 10:01 IST|Sakshi

సాక్షి, చిత్తూరు:  వడమాలపేట వద్ద లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. చెన్నై నుంచి భక్తులు తిరుమలకు కాలినడకన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మరిన్ని వార్తలు