యాదాద్రి భువనగిరిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

28 Aug, 2021 08:37 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మోజీగూడెం స్టేజ్‌ వద్ద ఓ బైక్‌ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని చిట్యాల మండలం పిట్టంపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.

చదవండి: పెళ్లి బరాత్‌.. అంతలో సడన్‌గా పోలీసుల ఎంట్రీ !

మరిన్ని వార్తలు