ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం: ఐదుగురు మహిళలు మృతి

13 Jun, 2021 13:23 IST|Sakshi

గరియాబంద్‌: ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్నఓ వ్యాను చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. బంధువు అంత్యక్రియలకు రాయ్‌పూర్‌ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: కొండ చరియలు విరిగిపడి నలుగురు చిన్నారులు మృతి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు