Hyderabad Road Accident: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఢీకొట్టిన లారీ

9 Feb, 2022 11:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగోల్ క్రాస్‌ రోడ్డు వద్ద వేగంగా వెళ్తున్న ఓ లారీ.. వినయ్‌ రెడ్డి (24) అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బైక్‌ను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అతడు అల్కాపురి నుంచి పటేల్‌ నగర్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్‌ను పట్టుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు