ఆగిన లారీని ఢీకొన్న బైక్‌

8 May, 2022 22:46 IST|Sakshi

ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

మదనపల్లె టౌన్‌: మదనపల్లె–పుంగనూరు రోడ్డు ఈడిగపల్లె వద్ద శనివారం ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పలమనేరు పట్టణం గడ్డ ఊరికి చెందిన మెకానిక్‌ షేఖ్‌ఖాద్‌ బాషా(20), గంగవరం చెన్నారెడ్డిపల్లె నుంచి వచ్చి పలమనేరు పట్టణం గుడియాతం రోడ్డులో కాపురం ఉంటున్న స్నేహితుడు కిరణ్‌కుమార్‌(22) ద్విచక్ర వాహనంలో సినిమా కోసం మదనపల్లెకు వచ్చారు.

తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గంమధ్యలోని మదనపల్లె–పుంగనూరు రోడ్డు ఈడిగపల్లె వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 108లో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఖాదర్‌బాషా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కిరణ్‌కుమార్‌ పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్‌ చేయగా కుటుంబీకులు తీసుకెళ్లారు. ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు పుంగనూరు పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ గంగిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు