వంట చేయడానికి వెళ్తూ.. రోడ్డుకు బలై..

11 Feb, 2023 03:03 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు వద్ద కారును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్‌

కారులోని నలుగురు మృతి.. వ్యాన్‌ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు

హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వంట చేసి.. మరో పెళ్లికి వెళ్తుండగా ఘటన

మృతులంతా నాగర్‌కర్నూల్‌ జిల్లా వాసులే.. పేద కుటుంబాల వారే..

మహేశ్వరం/వెల్దండ: శుభకార్యాలకు వంట చేస్తూ మెప్పు పొందిన నలుగురు యువకులు.. ఓ పెళ్లిలో వంట చేసి పెట్టారు. మరో శుభకార్యానికి వంట చేసేందుకు కారులో బయలుదేరారు. కానీ రోడ్డు ప్రమాదానికి బలైపోయారు. అతి వేగంగా దూసు కొచ్చిన డీసీఎం వీరి కారును ఢీకొట్టడంతో నలుగు రూ దుర్మరణం పాలయ్యారు. వ్యాన్‌ డ్రైవర్, క్లీన ర్‌లకు గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజా మున శ్రీశైలం జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేటు వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీనితో నాలుగు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.

వంట పని చేసేందుకు వెళ్తూ..: నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్డండ మండలం పోతేపల్లికి చెందిన బైకని యాదయ్య(34), ఎరుకలి చెన్న కేశవులు(35), ముంత శ్రీనివాసులు (30), లింగారెడ్డిపల్లికి చెందిన ఇమ్మరాశి రామస్వామి (32) నలుగురూ శుభ కార్యాల్లో వంట పనులు చేస్తుంటారు. నలుగురు కలిసి గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో ఓ పెళ్లికి వంట చేశారు.

రాత్రి నాగర్‌ కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం తుమ్మ లపల్లిలో మరో పెళ్లిలో వంట చేయడానికి స్విఫ్ట్‌ కారులో బయలుదేరారు. వారు అర్ధరాత్రి 2 గంటల సమయంలో శ్రీశైలం జాతీయ రహ దారిపై తుమ్మలూరు గేటు సమీపంలో ప్రయాణిస్తుండగా.. కందు కూరు నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న డీసీఎం వాహనం బలంగా స్విఫ్ట్‌ కారును ఢీకొట్టింది. కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయిపోగా.. డీసీఎం అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమా దంలో కారులోని రామస్వామి, యాద య్య, శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన చెన్నకేశ వులును 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో ప్రాణాలు వదిలాడు. డీసీఎం డ్రైవర్‌ షేక్‌ జానీ, క్లీనర్‌లకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్‌ అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నా రు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి కి తరలించారు. నలుగురి మృతితో రెండు గ్రామాలు విషాదంలో మునిగిపోయాయి.

మృతుల బంధువుల ఆందోళన
ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వారి బంధువులు, పోతేపల్లి, లింగారెడ్డి పల్లి సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌ ఎదుట, తర్వాత శ్రీశైలం జాతీయ రహదారి పై ధర్నాకు దిగారు. దీనితో సుమారు 3 గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి.

పోలీసులు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. కాగా మృతుల కు టుంబాలను కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ పరా మర్శించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు, పిల్లలకు ఉచిత విద్య తోపాటు ప్రభుత్వపరంగా అన్నిరకాలుగా ఆదుకుంటామ ని హామీ ఇచ్చారు. పోతేపల్లికి చెందిన సంజీవ్‌కుమార్‌ యాదవ్‌ బాధిత కుటుంబాలకు రూ.25వేల చొప్పున రూ.లక్ష ఆర్థి కసాయం అందజేశారు. ఇక బాధిత కుటుంబాలను చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, బీజేపీ నేత ఆచారి పరామర్శించారు.

అందరూ నిరుపేదలే..
తుమ్మలూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలుగురివీ పేద కుటుంబాలే. వీరిలో యాదయ్య వ్యవసాయం చేస్తూ.. పెళ్లిళ్ల సీజన్‌లో వంట పనులు చేస్తుంటాడు. తనకు సహాయంగా చెన్నకేశవులు, శ్రీనివాసులు, రామస్వామిలను తీసుకెళ్తుంటాడు. యాదయ్యకు భార్య భాగ్యమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామస్వామికి భార్య కృష్ణమ్మతో పాటు ఒక కుమారుడు, కుమార్తె.. కేశవులుకు భార్య రజిత ఒక కుమార్తె, కుమారుడు.. శ్రీనివాసులుకు భార్య కృష్ణమ్మతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు అయినవారు మృతి చెందడంతో.. ఈ నాలుగు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. 

మరిన్ని వార్తలు