నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

14 Sep, 2021 08:56 IST|Sakshi

నెల్లూరు: నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

క్షత గాత్రులను నెల్లూరు హరనాధపురంకి చెందిన వారిగా గుర్తించారు. తమ కుమారుడిని రెసిడెన్షియల్‌ స్కూల్లో జాయిన్‌ చేసి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిని సుధాకర్‌ రావు(76), అరుణ(34)లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

చదవండి: YSR Kadapa: ప్లాస్టిక్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

మరిన్ని వార్తలు