షాద్‌నగర్‌ వద్ద ఘోర ప్రమాదం, ముగ్గురు దుర్మరణం

28 Feb, 2021 09:21 IST|Sakshi

డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న కారు

ముగ్గురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని షాద్‌నగర్‌ బైపాస్‌ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌-బెంగళూరు జాతియ రహదారిపై వేగంగా దూసుకు వచ్చిన కారు షాద్‌ నగర్‌ బైపాస్‌ వద్ద అదుపుతప్పి పల్టీలు కొడుతూ.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను మలక్‌పేట వాసులుగా గుర్తించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు