ఢీ కొట్టి.. ఈడ్చుకెళ్లి..

10 Jun, 2022 01:22 IST|Sakshi

రాంగ్‌రూట్‌లో వచ్చి స్కూటీని ఢీకొట్టిన డీసీఎం

ఆపై వంద మీటర్లు ఈడ్చుకెళ్లిన వైనం

ఘటనా స్థలంలోనే ముగ్గురి దుర్మరణం

అంత్యక్రియలకు వెళుతుండగా ఘటన

భువనగిరి మండల పరిధిలో ప్రమాదం

భువనగిరి: బంధువుల అంత్యక్రియలకు వెళ్లేందుకు స్కూటీపై బయల్దేరిన వారిని డీసీఎం వాహనం రాంగ్‌ రూట్‌లో వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో వెనుక కూర్చున్న మహిళ ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. వీరిని ఢీ కొట్టిన తర్వాతైనా బండిపై ఉన్నవారు వేసిన కేకల్ని వినిపించుకుని వాహనాన్ని ఆపితే కనీసం రెండు ప్రాణాలైనా నిలిచేవి. కానీ, మద్యంమత్తులో వాహనాన్ని అత్యంత నిర్లక్ష్యంగా నడుపుతున్న ఆ డ్రైవర్‌ వీరు వేసిన కేకల్ని వినిపించుకోలేదు.

స్కూటీతో పాటు వీరిని కూడా వంద మీటర్లు దూరం ఈడ్చుకెళ్లిపోయాడు. దీంతో వీరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ముగ్గురు ప్రాణాలు తీయడమే కాకుండా ముగ్గురు పిల్లలు అనాథలయ్యేందుకు కారణమయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామ పరిధిలో గురువారం చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామానికి చెందిన దండబోయిన నర్సింహ(35), రాజ్యలక్ష్మి(30) దంపతులతో పాటు నర్సింహ వదిన దండ బోయిన జంగమ్మ(40) గురువారం బొమ్మల రామారం మండలం లోని చౌదరిపల్లి గ్రామంలో బంధువుల అంత్య క్రియలకు హాజరయ్యేందుకు స్కూటీపై బయల్దే రారు. అంతకు ముందేగానే జంగమ్మ భర్త బాలు మల్లు అంత్యక్రియలకు బయల్దేరి వెళ్లాడు.

అయితే స్కూటీపై బయల్దేరిన ముగ్గురూ భువనగిరి పట్టణం దాటిన తర్వాత హన్మాపురం గ్రామ పరిధిలోని బచ్‌పన్‌ స్కూల్‌ సమీపంలో చేరుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జగదేవ్‌పూర్‌ నుంచి భువనగిరి వైపు వేగంగా వస్తున్న డీసీఎం వాహనం వీరిని ఢీకొట్టింది. దీంతో స్కూటీ డీసీఎం వాహనం ముందు భాగంలో ఇరుక్కుపోయింది. స్కూటీపై వెనుక కూర్చున్న జంగమ్మ ఎగిరి రోడ్డుపైపడి అక్కడికక్కడే మృతి చెందింది. 

కేకలు పెడుతున్నా వినిపించుకోకుండా..
స్కూటీ ముందుభాగం డీసీఎంలో ఇరుక్కుపోవ డంతో రాజ్యలక్ష్మి, నర్సింహ కేకలు వేశారు. ఎంత గా అరుస్తున్నా వినిపించుకోకుండా డీసీఎం డ్రైవర్‌ ముందుకు దూసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లగానే రాజ్యలక్ష్మి స్కూటీ నుంచి విడిపోయి మృతి చెంద గా..నర్సింహను సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లిపోయాడు.

అప్పటికే అతడు కూడా మృతి చెందాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి డీసీఎం వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా, పారిపోతున్న డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

బంధువులు కూడా గుర్తించలేదు
మృతుల బంధువులు కూడా అదే దారిలో అంత్య క్రియలకు వెళ్తుండగా అప్పటికే ప్రమాదం జరగ డంతో జనం గుమికూడారు. దీంతో చనిపోయింది తమ బంధువులేనని గుర్తించలేకపోయామని వా రు వాపోతున్నారు. జంగమ్మ భర్త బాలుమల్లు ఇ చ్చిన ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడి పిన డీసీఎం డ్రైవర్‌పై 304( జీజీ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అనాథలైన పిల్లలు
నర్సింహా, రాజ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తల్లిదం డ్రులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ముగ్గురూ అనాథలయ్యారు. మరో మృతు రాలు జంగమ్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.  

మరిన్ని వార్తలు