రెండేళ్లపాప నాన్నను ఇంకెపుడు చూడలేదు.. మరో ఇంట్లో పెళ్లి సందడి బదులు..

13 Apr, 2022 06:33 IST|Sakshi
సంఘటన స్థలంలోనే మరణించిన హరీష్ (ఫైల్‌)

సాక్షి, మందస/పర్లాకిమిడి (శ్రీకాకుళం): ఒక ఇంటిలో తండ్రి కోసం ఎదురుచూస్తు న్న రెండేళ్ల పసిపాప ఇంకెప్పుడూ నాన్నను చూడ లేదు. అమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాన్న చేయి పట్టుకునే భాగ్యం ఇక లేదు. మరో ఇంటిలో కుటుంబానికి దిక్కుగా ఉండాల్సిన యువకుడు ఊపిరి వదిలేశాడు. ఇంకో ఇంటిలో పెళ్లి నవ్వుల బదులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఒక్క ప్రమాదం.. ఇన్ని కుటుంబాల్లో విషాదానికి కారణమైంది. ఒడిశాలోని గారబంద పెట్రోల్‌ బంక్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుకల హరీష్‌ (32), బొడ్డపాటి తులసీదాసు(25)లు మృతి చెంద గా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరికి 17వ తేదీన పెళ్లి నిశ్చయమైంది. వివరాల్లోకి వెళితే..  

మందస మండలంలో ని మూలిపాడు గ్రామానికి చెందిన పి.శివకుమార్‌ ఆర్మీ లో పని చేస్తున్నారు. ఆయనకు ఒడిశాలోని బీఎస్‌ పు రం గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 17న వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో శివకు మార్‌ వధువు ఇంటికి వెళ్లడానికి తన స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన వలంటీర్‌ హరీష్‌తో బైక్‌పై బయల్దేరాడు. ఒడిశాలోని గారబంద పెట్రోల్‌ బంక్‌ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్‌ వీరి బండిని బలంగా ఢీకొట్టింది. ఘటనలో హరీష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. శివకుమార్‌కు తీవ్ర గాయా లయ్యాయి. వీరి బండిని ఢీకొట్టిన బైక్‌పై ఉన్న బొడ్డపాటి తులసీదాసు కూడా ప్రమాద స్థలంలోనే ఊపిరి వదిలేశాడు. ఆయన వెనుక ఉన్న గోకర్ణపు రం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గారబంద పోలీసులకు సమాచారం అందించారు.

చదవండి: (నాగసులోచనా నన్ను క్షమించు..!.. నేను బాధపడుతూ నిన్ను మరింత..) 

క్షతగాత్రులను పర్లాఖిముండి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గోకర్ణపురం గ్రామానికి చెందిన వ్యక్తిని అక్కడి నుంచి శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శివకుమార్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం మెడికల్‌ కాలేజీకి తరలించారు. మూలిపాడు సర్పంచ్‌ గుసిరి వెంకటరావు, మృతుడు హరీష్‌ సోదరుడు తెలుకల డొంబురు, తెలుకల సురేష్‌తో పాటు పలువురు సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. హరీష్‌కు దీవెన అనే రెండేళ్ల కుమార్తె ఉండగా, ఆయన భార్య బబిత ప్రస్తుతం ఏడునెలల గర్భిణి. ఈ సంఘటనతో మూలిపాడు గ్రామంలో విషా దం చోటు చేసుకుంది.  

మరిన్ని వార్తలు