బైకు ప్రమాదంలో యువతి మృతి

29 May, 2022 23:32 IST|Sakshi

యలమంచిలి రూరల్‌ : జాతీయ రహదారిపై పెదపల్లి జంక్షన్‌ సమీపంతో బైక్‌ అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో యువతి మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తవలస మండలం యర్రవానిపాలెం గ్రామానికి చెందిన దుంగా రమేష్, లావణ్య(20) తెల్లవారుజామున బయలుదేరి అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో పెదపల్లి వద్ద బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు.

తీవ్రంగా గాయపడ్డ వారిని 108 సిబ్బంది, జాతీయ రహదారి సిబ్బంది అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లావణ్య మృతి చెందినట్టు యలమంచిలి టౌన్‌ ఎస్‌ఐ నీలకంఠరావు తెలిపారు. రమేష్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ తరలించారు.

మరిన్ని వార్తలు