తుపాకీలతో పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం

5 Sep, 2021 14:37 IST|Sakshi

యజమానిని గురిపెట్టిన దుండగులు

కౌంటర్‌లోని నగదుతో జంప్‌

సాక్షి, న్యూఢిల్లీ: దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు దుకాణంలోకి తుపాకీలతో దూరి యజమానిని బెదిరించారు. దుకాణదారులను గన్‌తో బెదిరించి గల్లాపెట్టెలో ఉన్న నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని ఖేరాఖుర్దు ప్రాంతంలో ఉన్న హర్డ్‌వేర్‌ దుకాణంలోకి శనివారం ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి తుపాకీలతో దూసుకొచ్చారు. ఏం జరుగుతుందో అర్థం కాక దుకాణ యజమాని నిల్చుండిపోయాడు. 

నగదు కౌంటర్‌ వద్ద ఉన్న యజమానికి గన్‌ షాట్‌ పెట్టి పక్కకు నెట్టారు. అనంతరం కౌంటర్‌ తెరచి నగదు తీసుకున్నారు. ఈ దోపిడీపర్వం సీసీ ఫుటేజీలో కనిపించింది. ఆ వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఈ దొంగలు చాలా తెలివితో వ్యవహరించారు. కౌంటర్‌ను టిష్యూ ధరించి తెరవడంతో వారి వేలిముద్రలు గుర్తించడం కష్టంగా మారింది. మాస్క్‌లు, హెల్మెట్‌ ధరించి వచ్చారు. దీంతో వారిని గుర్తించలేకపోతున్నారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ దోపిడీ పాత నేరస్తుల ముఠానే పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు