దోపిడికి వచ్చి జంట హత్యలు..నిందితుడిని చూసి కంగుతిన్న పోలీసులు

25 Dec, 2022 14:08 IST|Sakshi

దోపిడి చేసేందుకు వచ్చి ఇద్దరు వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో చోటు చేసుకుంది. బాధితులు 60 ఏళ్ల ఇబ్రహీం, అతడి భార్య హజ్రాగా గుర్తించారు. ఇబ్రహీం స్క్రాప్‌ డీలర్‌. అతడు ఇంటిలో శవమై  కనిపించగా అతడి భార్య టాయిలెట్‌ బాత్రూంలో మెడకు గుడ్డతో ఉరి వేసి చంపినట్లు కనిపించింది.

ఈ జంట హత్యలకు కీలక సూత్రధారి 12 ఏళ్ల బాలుడా! అని పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు . వాస్తవానికి ఆ బాలుడు ఆ దంపతులకు బాగా తెలిసినవాడే. అతను ఇబ్రహీం స్క్రాప్‌ బిజినెస్‌తో చాలా డబ్బులు కూడబెట్టాడని తెలుసుకుని వారిని దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ముగ్గురు వ్యక్తులను తనతో చేర్చుకుని వారి సాయంతో దోపిడి చేసేందుకు యత్నించాడు.

ఐతే దోపిడి చేసే ప్రయత్నం కాస్త చివరికి వారి హత్యలకు దారితీసింది. ఈ మేరకు పోలీసులు ఆ బాలుడి తోపాటు ఈ ఘటనలో పాలుపంచుకున్న మంజేష్‌, శివరాంలను కూడా అందుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే సందీప్‌ అనే వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు. వారి నుంచి సుమారు రూ. 12 వేల నగదు, ఒక మొబైల్‌ ఫోన్‌, బంగారు గొలుసు తదితరాలను స్వాధీనం చేసుకున్నమాని ఘజియాబాద్‌ సీనియర్‌ పోలీసు ఇరాజ్‌రాజా తెలిపారు.

(చదవండి: అక్క కళ్లలో ఆనందం కోసం బావను హత్య చేసిన బావమరిది)

మరిన్ని వార్తలు