కామాంధుడి పైశాచికం.. చితక్కొట్టిన మహిళలు

6 Dec, 2021 16:41 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ఓ రౌడీ షీటర్‌కు మహిళలు దేహశుద్ధి చేశారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి పుస్తకాలు, పెన్నలు ఎరచూపి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన రౌడీషీటర్‌ చిన్నారావుకు పిల్లల తల్లిదండ్రులు బడితెపూజ చేశారు. చదువుకునేందుకు సామాగ్రి ఇస్తానంటూ బాలికలను ఇంటికి తీసుకెళ్లిన చిన్నారావు.. వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినీలు.. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆ వ్యక్తికి బుద్ధి చెప్పారు. చిన్నారావును కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

చదవండి: ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. కాళ్లు, చేతులు, తల మాయం 

మరిన్ని వార్తలు