సచిన్‌వాజేకు మరోసారి ఎదురుదెబ్బ

3 Apr, 2021 17:04 IST|Sakshi

ఏప్రిల్‌ 7 వరకు  రిమాండ్‌ పొడగింపు

సాక్షి, ముంబై: వ్యాపారవేత్త ముఖేశ్‌ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం రేపిన వివాదంలో   సస్పెండైన  పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్  సచిన్‌ వాజే చుట్టూ అల్లుకున్న ఉచ్చు మరింత బిగిస్తోంది. తాజాగా ముంబైలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సస్పెండైన పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే కస్టడీని ఏప్రిల్‌ 7వ తేదీవరకు పొడగించింది. అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో పట్టుబడిన వాహనం స్కార్పియో యజమాని మన్సుఖ్‌ హిరేన్‌ అనుమానాస్పద మృతి కేసులో వాజే ఎన్‌ఐఏ అదుపులో ఉన్న సంగతి తెలిసిందే.

ఎన్ఐఏ విచారణలో షాకింగ్ విషయాలు 
ఈ కేసులో సచిన్ వాజే ప్రమేయం ఉందని గుర్తించిన ఎన్ఐఏ వాజేను మార్చి 13 న అరెస్టు చేసింది.  ఈ కేసు దర్యాప్తులో  షాకింగ్‌ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఎన్‌ఐఏ. ముఖ్యంగా ముంబైలోని నారిమన్ పాయింట్ ఫైవ్ స్టార్ హోటల్ లోని ఓ గదిని తన కోసం 100 రోజుల పాటు ఒక వ్యాపారవేత్త చేత 12 లక్షల వ్యయంతో బుక్ చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ తెలిపింది.  నకిలీ ఆధార్ కార్డుతో స్టార్ హోటల్లో  సదరు వ్యాపారవేత్త  ద్వారా 1964 రూమ్ ను బుక్ చేసుకున్నాడని వెల్లడించింది. వంద రోజులకు  12 లక్షల రూపాయలు వెచ్చించి దీన్ని తమ అధీనంలో ఉంచుకున్నారనితెలిపింది. చాలా వ్యాపార వివాదాల్లో వాజే ఈ వ్యాపారవేత్తకు అండగా ఉంటున్నాడని తేలిందని ఎన్‌ఐఏ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నసంగతి తెలిసిందే.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు