సచివాలయం మహిళా పోలీస్‌ ఆత్మహత్య!?

12 Mar, 2021 15:57 IST|Sakshi
ముత్యాల భార్గవి మృతదేహం, భార్గవి (ఫైల్‌) (ఇన్‌సెట్లో)

సాక్షి, చీరాల: చీరాల మున్సిపాలిటీలోని 16వ వార్డు సచివాలయం మహిళా పోలీసు ముత్యాల భార్గవి (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి బంధువులు తమ కుమార్తెను అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను అల్లుడు చిత్రహింసలకు గురి చేసి హత్య చేసి ఉంటాడని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన గురువారం చీరాల సాల్మన్‌ సెంటర్‌లో వెలుగు చూసింది. చీరాల ఒన్‌టౌన్‌ సీఐ రాజమోహన్‌ కథనం ప్రకారం.. పట్టణంలోని 16వ వార్డు సచివాలయంలో ముత్యాల భార్గవి మహిళా పోలీసుగా పనిచేస్తోంది. ఆమెకు భర్త రాంబాబు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  బుధవారం రాత్రి ఏం జరిగిందో ఏమోగానీ ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కేసు నమోదు చేసి మృతురాలి భర్త రాంబాబును విచారణ చేస్తున్నామని, విచారణ అనంతరం వివరాలు తెలుస్తాయని, ఈ మేరకు భార్గవి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. తమ కుమార్తె భార్గవిని అల్లుడు రాంబాబు మద్యం తాగి తరుచూ వేధింపులకు గురిచేస్తుండేవాడని, ఈ విషయం పలుమార్లు తమకు చెప్పుకుని బాధపడిందని, కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కన్న తల్లి విగత జీవిగా పడి ఉండటంతో పిల్లలు భోరున విలపిస్తున్నారు. సాల్మన్‌ సెంటర్‌తో పాటు మృతురాలు పనిచేసే సచివాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.   
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు