శాడిస్ట్‌ భర్త నిర్వాకం.. కట్టుకున్న భార్యనే

2 Jul, 2021 06:35 IST|Sakshi

మహిళా టెక్కీకి నరకం

ఇంటర్నెట్‌లో దుష్ప్రచారం  

బనశంకరి(కర్ణాటక): కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి సైకో అవతారమెత్తాడో భర్త. భార్య ఫోటోను, ఆమె ఫోన్‌ నంబరును ఇంటర్నెట్లో పోస్ట్‌చేసి వ్యభిచారి అని రాసిన ఘరానా భర్త పై తూర్పు విభాగం మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందిరానగరకు చెందిన మహిళా టెక్కీ (25) చేసిన ఫిర్యాదు ప్రకారం ఆమె భర్త జయశంకర్‌ కుమార్‌సింగ్‌ (29) ఈ నీచానికి పాల్పడ్డాడు.

ఆంక్షలతో కట్టడి..  
జయశంకర్‌ ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజీనీర్‌గా పనిచేసేవాడు. మహిళా టెక్కీతో 2019 లో వివాహమైంది. ఇంటి ఖర్చులను ఆమే భరించేది. మీ పుట్టింటి వారితో మాట్లాడరాదని ఆమెను కట్టడి చేసేవాడు. తరచూ గొడవ పడి కొట్టడం, వేధించడం, ప్రశ్నిస్తే పొడిచి చంపుతానని బెదిరించడంతో ఆమెకు ప్రాణభయం ఏర్పడింది. దీంతో భర్త నుంచి దూరంగా ఉండాలని ఒక పీజీ హాస్టల్‌లో తలదాచుకుంది.

అశ్లీల సందేశాలు..  
కానీ సైకో భర్త ఆమెకు అశ్లీల మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ పంపించి వేధించేవాడు. గతంలో హలసూరు పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, ఇకపై బుద్ధిగా ఉంటానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అయితే ఈసారి ఆమె పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్‌ సృష్టించి అందులో ఆమె మొబైల్‌ నెంబరు పెట్టి ఎస్కార్ట్స్‌ సర్వీస్‌ అని అప్‌లోడ్‌ చేశాడు. దీంతో ఆమె ఫోన్‌కు విపరీతంగా కాల్స్, అసభ్య సందేశాలు రావడం మొదలైంది. దీంతో ఆరా తీయగా భర్త పాడుపని గురించి తెలిసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు