రైల్వే స్టేషన్‌ ఘటన: సాయి డిఫెన్స్‌ అకాడమీదే కీలక పాత్ర!

24 Jun, 2022 13:40 IST|Sakshi

హైదరాబాద్‌: గత వారం జరిగిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అల్లర్ల కేసులో సాయి డిఫెన్స్‌ అకాడమీ కీలక పాత్ర పోషించింది. మొత్తం కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ సాయి డిఫెన్స్‌ అకాడమీ కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అల్లర్ల ఘటనకు ముందు రోజు ఇన్‌స్టిట్యూట్‌లోనే మకాం వేసి పథకం రచించారు. ఈ మేరకు కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. 

టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల విచారణలో సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు ప్రధాన పాత్ర పోషించాడు.అనుచరులతో విధ్వంసానికి రచన చేసినట్లు గుర్తించారు. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే నలుగురు అనుచరులతో విద్యార్థులను పురిగొల్పినట్లు, దీనిలో భాగంగా హోటల్‌ అనుచరులతో కలిసి విధ్వంసానికి ప్లాన్‌ చేశాడు. గుంటూరు ర్యాలీ నుంచే ఆందోళనకు స్కెచ్‌ వేశాడు. 

>
మరిన్ని వార్తలు