సైదాబాద్‌ ఘటన: రూ. 20 లక్షలు చెక్కును తిరస్కరించిన బాధిత కుటుంబం

16 Sep, 2021 10:19 IST|Sakshi

హైదరాబాద్: సైదాబాద్‌ బాలిక ఘటన పట్ల రోజురోజుకు ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. చిన్నారిని హత్య చేసిన దుర్మార్గుడి కోసం పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. కాగా, బాధిత కుటుంబానికి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్ముద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్‌లు గురువారం రూ. 20 లక్షల చెక్కును ఇచ్చారు. అయితే, మంత్రులు ఇచ్చిన చెక్కును బాధిత కుటుంబం తిరస్కరించింది.

‘మాకు చెక్‌ వద్దు.. ఆ దుర్మార్గుడిని ఉరితీయాలని’ వేడుకున్నారు. మంత్రులు ఇచ్చిన చెక్కును మీడియా ముఖంగా తిరిగి ఇచ్చేస్తామని బాలిక తండ్రి తెలిపారు. దీనిపై చిన్నారి తండ్రి.. తాము చెక్‌ తీసుకోలేదు.. బల్లపై పేట్టేసి వెళ్లారని తెలిపారు. ఆ చెక్కు మాకోద్దు.. దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని కన్నీటి పర్యంతమయ్యారు.  

చదవండి: చిన్నారి కేసులో కీలక మలుపు: పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు

మరిన్ని వార్తలు