ఆన్‌లైన్‌ పరిచయం.. ఐదేళ్ల ప్రేమ.. రెండుసార్లు అబార్షన్‌ చేయించి

20 Oct, 2021 20:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పిన యువకుడు ఆమెను లోబరుచుకున్నాడు. ప్రేమ పేరుతో అయిదు సంవత్సరాలు శారీరకంగా వాడుకున్నాడు. ఈక్రమంలో రెండు సార్లు ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు. అయితే తీరా పెళ్లి చేసుకోమని పట్టుబడితే ముఖం చాటేయడం మొదలుపెట్టాడు.
చదవండి: ప్రాణం తీసిన పట్టింపులు.. నిశ్చితార్థం రద్దయిందని.. 

ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే కులం ఒకటి కానందుకు మావాళ్ళు ఒప్పుకోవట్లేదని చేతులెత్తేశాడు. గత్యంతరం లేక బాధిత దళిత యువతి సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా యువకుడు మోసం చేసినా, తనకు అతనితోనే వివాహం చేయించమని బాధితురాలు పోలీసులకు వేడుకుంది.
చదవండి: బాలికకు మాయమాటలు చెప్పి.. ఇంటి వెనకాలకు తీసుకెళ్లి..

మరిన్ని వార్తలు