పెటి కేసులో సైఫాబాద్‌ పోలీసుల దురుసు ప్రవర్తన.. లాఠీలతో మహిళలపై దాడి?

19 Feb, 2022 12:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున పోలీసుల దురుసు ప్రవర్తన ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్న పెటి కేసు వివాదంలో ముస్లిం మహిళలపై  సైఫాబాద్‌ ఎస్సై సూరజ్‌, కానిస్టేబుల్‌ లాఠీలతో కొట్టారు. సైఫాబాద్ నుంచి ఇద్దరు హిళలు కారులో నాంపల్లి వైపు వెళుతుండగా అదే దారిలో ప్రయాణిస్తున్న బస్సుతో మైనర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. 

దీంతో మహిళలు, బస్సు డ్రైవర్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్సై సూరజ్, ఓ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే తమను ఎస్సై సూరజ్‌, కానిస్టేబుల్‌ లాఠీతో కొట్టినట్లు ఇద్దరు మహిళలు ఆరోపించారు. దీంతో పెద్దఎత్తున  అక్కడికి చేరుకున్న యువకులు, బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం కావాలని రోడ్డు పై ఆందోళనకు దిగారు.
చదవండి: రాకాసి రోడ్డు.. ప్రమాదాలకు నిలయంగా ఎన్‌హెచ్‌–44

తమకు న్యాయం చేయాలని ఎస్సై సూరజ్, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమను లాఠీతో గాయపరిచిన ఎస్సై, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ సీఐ జలీల్ పాషా, సైఫాబాద్ డీఐ రాజు నాయక్‌లు బాదితులను శాంతింపజేసీ ప్రయత్నం చేశారు. విచారణ జరిపి ఎస్‌ఐపై చర్యలు తీసుకుంటామని బాధిత మహిళకు నచ్చజెప్పారు. బాధిత మహిలు ఇచిన ఫిర్యాదును నాంపల్లి సీఐ కలిల్ పాషా స్వీకరించి , విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు