ముంబై హత్యాచార ఘటన.. బాధితురాలి మృతి

11 Sep, 2021 15:57 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర ముంబై సాకి నాక ప్రాంతంలో దారుణ అత్యాచారానికి గురైన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాధితురాలిని గట్కోపార్‌ రాజావాడి ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ శనివారం ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ముంబై సాకి నాక ప్రాంతలోని ఖైరాని రోడ్‌ మార్గంలో శుక్రవారం దుండగులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ప్రైవేట్‌ పార్ట్స్‌లో రాడ్‌ చొప్పించి.. అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. విపరీతంగా రక్తస్రావం అయ్యి.. స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న బాధితురాలిని ఆ మార్గంలో వెళ్తున్న వారు గుర్తించి.. గట్కోపార్‌ రాజావాడి ఆస్పత్రిలో చేర్చారు. 
(చదవండి: గోదావరి నదీ తీరాన ఇల్లు.. నాడు ఆ వ్యక్తి చేసిన పనితో వినూత్నంగా)

విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా 45 ఏళ్ల వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. దారుణం అనంతరం నిందితుడు టెంపో వాహనంలో పారిపోయినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ దారుణంలో మరింత మంది పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 
(చదవండి: 80 ఏళ్ల వృద్ధుడి హత్య: ‘రూ.10 వేలు ఇస్తా.. నీ భార్యను పంపు’)

ఈ ఘటన పట్ల జాతీయ మహిళా కమిషన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులను సత్వరమే అరెస్ట్‌ చేయాలని ముంబై పోలీసులకు సూచించింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర కేబినెట్‌ మినిస్టర్‌ నవాబ్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. ‘‘మాకు ఇచ్చిన సమయంలోపు చార్జ్‌షీట్‌ దాఖలు చేస్తాం. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు అప్పగించి నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తాం’’ అన్నారు.

చదవండి: సైదాబాద్ బాలిక హత్యాచార కేసు.. నిందితుడు అరెస్ట్

మరిన్ని వార్తలు