సలాడ్‌ ఆలస్యమైందని కొడవలితో భార్యను, పిల్లాడిని..

2 Jun, 2021 15:03 IST|Sakshi

భార్య మృతి.. కుమారుడి పరిస్థితి విషమం

లక్నో: భోజనంలో సలాడ్‌ అందించడం ఆలస్యమైందని భర్త తన భార్య దాడి చేసి హత్య చేయడమే కాకుండా కుమారుడిని తీవ్రంగా గాయపర్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. ఈ ఘటన షామ్లి జిల్లా గోగవన్‌ జలాల్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఘటన జరిగిన అనంతరం నిందితుడు వెంటనే పరారయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మురళి (45), సుదేశ్‌ భార్యాభర్తలు. రాత్రి భోజనంలో రోజు మాదిరిగా పండ్ల సలాడ్‌ అందిస్తుండేది. సోమవారం కూడా సలాడ్‌ పెట్టాలని భార్యను అడిగాడు. అయితే ఆమె వేరే పనిలో ఉండి సలాడ్‌ వడ్డించడంలో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి లోనైన మురళి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన మురళి వెంటనే అక్కడ కొడవలి తీసుకుని భార్యపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. తేరుకున్న అనంతరం నిందితుడు మురళి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. రక్తపు మడుగులో ఉన్న సుదేశ్‌, ఆమె కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందగా కుమారుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

చదవండి: భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్‌ అరెస్ట్‌
చదవండి: లాక్‌డౌన్‌తో పాన్‌ బ్రోకర్‌ దంపతులు ఆత్మహత్య

మరిన్ని వార్తలు