చైన్‌స్నాచింగ్‌ చేయకపోతే నిద్రపట్టదు

27 Aug, 2022 10:59 IST|Sakshi
సొత్తును పరిశీలిస్తున్న సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ ప్రతాప్‌ రెడ్డి( ఇన్‌సెట్‌లో) బైకుపై వెళ్తున్న స్నాచర్‌ సంతోష్‌

యశవంతపుర: బెంగళూరు నగరంలోని 51 పోలీసుస్టేషన్ల పరిధిలో నాలుగు సంవత్సరాలుగా గొలుసు చోరీలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన సంతోష్‌ అనే చైన్‌స్నాచర్‌ను, అతనికి సహకరించిన రవి అనే నిందితుడిని పుట్టేనహళ్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేజీ బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో సంతోష్‌ చెప్పిన విషయాలు విని పోలీసులు అవాక్కయ్యారు.

సూర్యోదయం కాకముందే ఇంటినుంచి పల్స్‌ర్‌పై రోడ్డెక్కే సంతోష్‌  ఒక చైన్‌స్నాచింగ్‌నైనా చేయకుంటే రాత్రికి నిద్ర పట్టేదికాదు. బైక్‌కు రోజుకొక నంబర్‌ ప్లేట్‌ మార్చేవాడు.ఆర్‌టీఓ అఫీసుకెళ్లి బైకు నంబర్లను సెర్చ్‌ చేసేవాడు. ముఖాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా హెల్మెట్‌ తీసేవాడు కాదు. పోలీసులకు తలనొప్పిగా మారిన ఈ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు  జేపీనగర, పుట్టేనహళ్లి, హొసకోట, జయనగర, బన్నేరఘట్ట, యలహంక, కొడిగేహళ్లి, అమృతహళ్లి ప్రాంతాల్లో 300 కిలోమీటర్ల మేర అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. చోరీ సొత్తును  సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ ప్రతాప్‌ రెడ్డి పరిశీలించారు. 

(చదవండి: అవమాన భారంతో ఉపాధ్యాయుని ఆత్మహత్య) 

మరిన్ని వార్తలు