యువతిపై సర్పంచ్‌ అత్యాచారం

9 Oct, 2022 11:00 IST|Sakshi
సర్పంచ్‌ శంకర్‌నాయక్‌  

పోలీసుల అదుపులో నిందితుడు 

సాక్షి, వికారాబాద్‌: ఓ గ్రామ సర్పంచ్‌ పూటుగా తాగిన మైకంలో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణాన్ని నిలదీసిన యువతి అన్నపై దాడి చేశాడు. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నంద్యానాయక్‌తండాలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

తండాకు చెందిన ఓ యువతి (21)మేకల కాపరిగా పనిచేస్తోంది. దసరా పండుగ సందర్భంగా యువతి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో టీవీ చూసేందుకు వచ్చిన తమ బాబాయి పిల్లల్ని తిరిగి అప్పగించేందుకు వాళ్ల ఇంటికి వెళ్లింది. పక్కనే సర్పంచ్‌ రాథోడ్‌ శంకర్‌ నాయక్‌ ఇల్లు ఉంది.

యువతి తిరిగి వస్తుండగా అప్పటికే పూటుగా మద్యం తాగి ఉన్న శంకర్‌నాయక్‌ ఆమెకు మాయమాటలు చెప్పి మిద్దమీదకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే పిల్లల్ని అప్పగించేందుకు వెళ్లిన తన చెల్లి ఇంకా ఇంటికిరాలేదని అటుగా వెళ్లిన యువతి అన్న అక్కడున్న పిల్లల్ని ఆరాతీయగా సర్పంచ్‌ తీసుకెళ్లాడని చెప్పారు. వెంటనే మిద్దెమీదకు వెళ్లి చూడగా జరిగిన దారుణం కంటబడింది.

సర్పంచ్‌గా ఉంటూ ఇలాంటి పనులు చేస్తావా అని గట్టిగా నిలదీయగా అతడిపై శంకర్‌నాయక్‌ దాడికి పాల్పడ్డాడు. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారి రాకను చూసి సర్పంచ్‌ తప్పించుకున్నా డు. అయితే కొద్దిసేపటికే అతడిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. 

చదవండి: (అపరిచితుడితో ఫోన్‌లో మాట్లాడి వివాహిత అదృశ్యం.. మరోచోట విద్యార్థిని..)

మరిన్ని వార్తలు