Nizamabad: అనుమానాస్పద స్థితిలో సర్పంచ్‌ భార్య మృతి

29 Sep, 2022 11:27 IST|Sakshi
రవళి (ఫైల్‌)

సాక్షి, నిజామాబాద్‌(మాచారెడ్డి): మండలంలోని లక్ష్మిరావులపల్లి గ్రామ సర్పంచ్‌ ఎర్రొల్ల నవీన్‌కుమార్‌ భార్య రవళి (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంగళవారం సాయంత్రం ఆమె పురుగుల మందు తాగినట్లు గుర్తించి భర్త నవీన్‌కుమార్, కుటుంబ సభ్యు లు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా  చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

నిర్మల్‌ జిల్లా దేగాం గ్రామానికి చెందిన రవళిని మూడేళ్ల కిందట నవీన్‌కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో ముగ్గురు సోదరీమణులు కట్నకానుకలు ఇచ్చి పెళ్లి నిర్వహించారు.  పెళ్లి అయిన కొన్ని రోజుల నుంచే అదనపు కట్నం కోసం భర్త వేధించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

భర్త నవీన్, కుటుంబ సభ్యులు ప్రవీణ్, నరేశ్, సిందుజలు రవళిని బలవంతంగా కారులో తీసుకెళ్లి హత్య చేశారని వారు పేర్కొన్నారు. నోట్లో క్రిమిసంహారక మందు పోసి ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు. బాధ్యులైన భర్త, ఆయన కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రవళి కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. కాగా మృతురాలికి ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సంతోష్‌కుమార్‌ తెలిపారు. 

చదవండి: (ప్రియుడితో ఏకాంతంగా ఉండగా వీడియో.. లైంగిక వాంఛ..)

మరిన్ని వార్తలు