మరణించిన శిశువు బతికుందని.. 

13 Dec, 2021 03:33 IST|Sakshi

తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చిన స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు 

ఆపరేషన్‌ చేసి మృత శిశువును అప్పగించిన ఆస్పత్రిపై బంధువుల దాడి 

సూర్యాపేట జిల్లాలో సంఘటన 

సూర్యాపేట క్రైం: శిశువుకు హార్ట్‌ బీట్‌ లేకున్నా బతికుందని స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు రిపోర్టు ఇచ్చారు. డాక్టర్లు ఆపరేషన్‌ చేసి ప్రాణం లేని శిశువును బయటకు తీశారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని హాస్పిటల్‌పై బంధువులు దాడి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన మరిపెద్ది లావణ్యకు పురిటినొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని మాధవి ఆస్పత్రికి ఆదివారం ఉదయం తీసుకొచ్చారు.

డాక్టర్‌ సలహా మేరకు లావణ్యకు దగ్గర్లోని స్కానింగ్‌ సెంటర్‌లో స్కానింగ్‌ తీయించగా శిశువుకు హార్ట్‌ బీట్‌ లేదని రిపోర్ట్‌ ఇచ్చారు. భర్త శ్రీకాంత్‌గౌడ్‌ మరోసారి ఆపిల్‌ స్కానింగ్‌ సెంటర్‌లో స్కానింగ్‌ తీయించగా శిశువుకు హార్ట్‌ బీట్‌ ఉందని రిపోర్ట్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఆపరేషన్‌ చేసిన డాక్టర్లు మృత శిశువును బయటికి తీశారు. దీంతో డాక్టర్‌ నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్‌పై దాడి చేశారు. జన్యు సంబంధిత వ్యాధితో శిశువు మృతి చెందినట్లు డాక్టర్‌ మాధవి వివరణ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు