సింగరేణి బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి

9 Mar, 2022 07:32 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి/రామగిరి/గోదావరిఖని: మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్‌ ఎట్టకేలకు ముగిసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి పరిధిలోని ఏపీఏ అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు (ఏఎల్‌పీ)లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అసిస్టెంట్‌ మేనేజర్‌ తేజ, సెఫ్టీ ఆఫీసర్‌ జయరాజ్‌, కార్మికుడు శ్రీకాంత్‌ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీమ్‌ బయటకు తీసింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురిలో నలుగురు క్షేమంగా ఉన్నారని, ముగ్గురు మృతి మరణించారని అధికారులు తెలిపారు. 

ఏఎల్‌పీ బొగ్గుగనిలో 86వ లెవల్‌ వద్ద రూఫ్‌ బోల్డ్‌ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఏరియా సేఫ్టీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్‌సహా మరో ఐదుగురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకోగా.. ముగ్గురిని సోమవారమే బయటకు తీసుకొచ్చారు. రవీందర్‌ను రెస్క్యూ టీం మంగళవారం కాపాడింది.

సంబంధిత వార్త:  ఆ ముగ్గురూ ఎక్కడ?
 

మరిన్ని వార్తలు