లిఫ్ట్‌ పేరుతో టీచర్‌పై లైంగిక దాడి.. వీడియోలు తీసి ఆ తర్వాత..

13 May, 2022 18:09 IST|Sakshi

దేశంలో ప్రతీరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ముస్లిం వ్యక్తి.. టీచర్‌పై లైంగిక దాడి చేసి వీడియోలు తీసి అనంతరం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. షహజాన్‌పూర్‌లో లిఫ్ట్‌ పేరుతో అమీర్‌ అనే వ్యక్తి గవర్నమెంట్‌ టీచర్‌(28) బైకుపై ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెకు మత్తుమందు వాసన చూపించి స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత అమీర్‌.. టీచర్‌పై అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. ఇదిలా ఉండగా.. తమ కుమారుడిని కాపాడుకునేందు టీచర్‌ను మతం మారాలని, తనను పెళ్లి చేసుకోవాలని అమీర్‌ కుటుంబ సభ్యులు టీచర్‌ను బెదిరింపులకు గురిచేశారు. 

దీంతో.. సదరు మహిళ జరిగిన విషయాన్ని పోలీసులు తెలిపి అమీర్‌పై ఫిర్యాదు చేసింది. నిందితుడు అమీర్‌తో సహా ఐదుగురిపై ఉత్తరప్రదేశ్‌లో తీసుకువచ్చిన మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. కాగా, ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

ఇది కూడా చదవండి: నరకం చూపించారు, బర్త్‌డే రోజే చంపేశారు: మోడల్‌ తల్లి

మరిన్ని వార్తలు