బస్సులో అర కిలో బంగారం పట్టివేత

21 Feb, 2022 05:52 IST|Sakshi
పట్టుబడిన బంగారు ఆభరణాలు

కర్నూలు: స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో తనిఖీల్లో అర కిలో బంగారు నగలు పట్టుబడ్డాయి. కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై సెబ్‌ సీఐ మంజుల, ఎస్‌ఐ గోపాల్‌ ఆధ్వర్యంలో ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి రాయదుర్గం వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సును తనిఖీ చేయగా.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన రాజేష్‌ బ్యాగ్‌లో 544 గ్రాముల బంగారు వడ్డాణాలు, నెక్లెస్‌లు లభ్యమయ్యాయి. వీటి విలువ రూ.28 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

బళ్లారిలోని రాజ్‌మహల్‌ ఫ్యాన్సీ జ్యూవెలర్స్‌ షాపునకు చెందిన గుమస్తానని తెలిపిన రాజేష్‌ అందుకు ఆధారాలు చూపకపోవడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. హైదరాబాద్‌లో నగలు చేయించి బళ్లారి తీసుకువెళ్తున్నట్లు తెలిపాడు. వే బిల్లు, ట్రావెలింగ్‌ ఓచర్‌ కానీ చూపకపోవడంతో ఆభరణాలను స్వాధీనం చేసుకుని రవాణాదారునితో పాటు ఆభరణాలను తదుపరి చర్యల నిమిత్తం కర్నూలు అర్బన్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు