గంజాయి, డ్రగ్స్‌ పట్టివేత

23 May, 2021 04:32 IST|Sakshi

10 మంది నిందితుల అరెస్టు

కర్నూలు:  కర్నూలులో భారీగా గంజాయి, నిషేధిత డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. వివరాలను సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ గౌతమిసాలి శనివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో డీఎస్పీలు మహేశ్వరరెడ్డి, కేవీ మహేష్‌తో కలసి వివరాలు వెల్లడించారు.  విశ్వసనీయ సమాచారం మేరకు కర్నూలు మూడో పట్టణ సీఐ తబ్రేజ్, సెబ్‌ సీఐ రామకృష్ణ తమ సిబ్బందితో నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని అరుంధతి నగర్‌కు వెళ్లే దారిలో పాడుబడిన ఇంటి దగ్గర దాడులు నిర్వహించారు. వారినుంచి రూ.4.25 లక్షలు విలువ చేసే 17 కేజీల గంజాయి, రూ. 27,500 విలువ చేసే 22 మిల్లీ గ్రాముల ఎల్‌ఎస్‌డీ స్టాంప్స్‌(నిషేధిత డ్రగ్‌)ను స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలుకు చెందిన మహమ్మద్‌ వసీం, షేక్‌ షాహిద్‌ బాషా,  జహీర్‌ అలీఖాన్, షేక్‌ షాహిద్‌ బాషా,   షేక్‌ మహమ్మద్‌ సుహైల్, బి.తాండ్రపాడుకు చెందిన షేక్‌ ఫిరోజ్‌ బాషా, చాకలి దస్తగిరి, విష్ణుటౌన్‌షిప్‌కు చెందిన బునెద్రి అగ్నివిుత్ర, గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడు గ్రామానికి చెందిన బీమినేని భరత్‌చంద్ర, గుంటూరు ఫాతిమాపురానికి చెందిన కాటుమాల జోసెఫ్‌ను అరెస్టు చేశారు. కాగా, వీరు గంజాయిని గిద్దలూరు, తుని ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. నిందితులపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌ –1985 కింద కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు