సీఐతో శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కుట్ర కేసు నిందితుడి సెల్ఫీ

29 Apr, 2022 09:07 IST|Sakshi

కుత్బుల్లాపూర్‌: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న మున్నూరు రవి బుధవారం జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ప్రత్యక్షం కావడం కలకలం రేపగా... తాజాగా పేట్‌బషీరాబాద్‌ సీఐ రమేష్‌తో సెల్ఫీ మరో వివాదం అయింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్లీనరీలో రవి పాల్గొనడం.. పోలీసు అధికారులతో సెల్ఫీ దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేవలం ప్రజాప్రతినిధులకే ఆహ్వానం ఉండగా మున్నూరు రవి హాజరు కావడంపై ఇప్పటికే ఇంటిలిజెన్స్‌ దృష్టి పెట్టింది. ఇదే ప్లీనరీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సైతం ఉండడం అనుకోని సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. బందో బస్తులో ఉన్న తాను మున్నూరు రవిని గుర్తించి దగ్గరికి వెళ్లి ఎలా వచ్చావు ..అని అడిగే లోపే సెల్ఫీ తీశాడని.. రవి వచ్చిన విషయాన్ని బాలానగర్‌ డీసీపీ సందీప్‌ దృష్టికి తీసుకెళ్లానని సీఐ రమేష్‌  వివరణ ఇచ్చారు. 

(చదవండి: అప్పిచ్చి.. ఆందోళన చేసి.. ప్రాణాలు పోగొట్టుకుని..)

మరిన్ని వార్తలు