Rajasthan: సెల్ఫీల కోసం టవర్‌పై కిక్కిరిసిన జనం, పిడుగుపాటుతో..

12 Jul, 2021 07:25 IST|Sakshi

జైపూర్‌: చల్లబడిన వాతావరణం.. వానలో ‘సెల్ఫీ’ అత్యుత్సాహం ప్రాణాలు తీసింది. పిడుగుపాటుతో పదహారు మంది చనిపోగా.. డజన్ల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారుల చెప్తున్నారు.

ఆదివారం సాయంత్రం వాన కురుస్తుండగా అమెర్‌ప్యాలెస్‌(అమర్ ప్యాలెస్‌)ను సందర్శిస్తున్న వాళ్లలో కొందరు ఆనందంతో క్లాక్‌టవర్‌పైకి ఎక్కారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా టవర్‌పై పిడుగుపడింది. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఆ కంగారులో పక్కనున్న హిల్‌ ఫారెస్ట్‌లోకి కొందరు దూకేశారు. ఇప్పటిదాకా 16 మంది మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నారు.

కాగా, మరో 29 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకశాం ఉందని భావిస్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ దిగ్‌భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు