వాళ్లపై నేను కూడా కేసు పెడతా: అమర్‌

3 Feb, 2021 19:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్దేశపూర్వకంగానే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ‘కోయిలమ్మ’ సీరియల్‌ నటుడు అమర్‌ అలియాస్‌ సమీర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తన గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి రెచ్చగొట్టిన వాళ్లపై తాను కూడా తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు. కాగా బోటిక్ నిర్వహణ విషయంలో స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో జరిగిన గొడవలో, అమర్‌పై రాయదుర్గం పోలీస్‌ స్టేషనులో కేసు నమోదైన విషయం తెలిసిందే. మణికొండలో బొటిక్‌ నడుపుతున్న శ్రీవిద్య, రష్మీదీప్‌ అనే యువతులు అభిప్రాయ భేదాలతో దూరమయ్యారు. ఈ క్రమంలో శ్రీవిద్య ఒక్కరే బొటిక్‌ నడుపుతున్నారు.(చదవండి: మదనపల్లి మధుకర్‌కు 12 ఏళ్ల జైలు)

దీంతో తమకు సంబంధించిన రూ. 5 వేల విలువ గల కుట్టుమిషన్‌ను షాపులో వదిలివేశామని, దానిని తిరిగి ఇవ్వాలంటూ రష్మి స్నేహితులైన స్వాతి, తేజ, అమర్, హర్ష అడిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అమర్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ విషయం గురించి బుధవారం మీడియాతో మాట్లాడిన అమర్‌.. ‘‘ఆ రోజు నేను తాగి వెళ్లలేదు. బ్లడ్ రిపోర్ట్స్ కూడా నెగెటివ్గానే వచ్చాయి. నిజానికి, కావాలనే నాపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఆ రోజు గొడవ పడిన వీడియో లో కేవలం 2 నిమిషాలు మాత్రమే బయటికి రిలీజ్ చేశారు.

అందులో ఉన్న వాళ్లందరూ మా స్నేహితులే. ఎఫ్‌ఐఆర్‌ కాపీలో సైతం నేను లైంగిక వేధింపులకు పాల్పడలేదనే ఉంది. నా గురించి అసత్యాలు ప్రచారం చేసిన వారిపై నేను కూడా కేసు పెడతాను. నేను రూ. 5 లక్షలు తీసుకున్నట్టు ఆధారాలు చూపించాలి. కానీ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడిది. మీడియాలో కూడా నేను గొడవ పడుతున్నట్టు చూపించారు. అంతకు ముందు నుంచే గొడవ జరిగింది దాన్ని మాత్రం చూపించలేదు’’ అని చెప్పుకొచ్చాడు.(చదవండి: ‘కోయిలమ్మ’నటుడు అమర్‌‌‌పై కేసు)

మరిన్ని వార్తలు