డ్రగ్స్‌ కేసులో ప్రముఖ టీవీ నటి అరెస్ట్‌

26 Oct, 2020 12:33 IST|Sakshi

ముంబై : ప్రముఖ హిందీ సీరియల్స్‌ నటి ప్రీతికా చౌహాన్ ‌(30) డ్రగ్స్‌ వినియోగం కేసులో అరెస్టయ్యారు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు శనివారం ఆమెతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో వర్సోవా, మచ్చిమార్‌ కాలనీలోని ఓ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. గంజాయిని కొనుగోలు చేస్తున్న ప్రీతికా చౌహాన్‌‌, విక్రేత ఫైజల్‌లను అరెస్ట్‌ చేశారు. వారి వద్దనుంచి 99 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆదివారం వారిద్దరిని కోర్టులో హాజరు పరిచారు. వీరికి నవంబర్‌ 8వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.(కిలాడీ లేడీ.. 30 ఏళ్లుగా..)

కాగా, హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ప్రీతికా చౌహాన్‌ 2016లో విడుదలైన ‘జమీలా’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. దేవోకి దేవ్‌ మహదేవ్‌, సంకట్‌ మోచన్‌ మహాబలి హనుమాన్‌, మా వైష్టోదేవీ, సంతోషీ దేవీ, సీఐడీ, సావ్‌ధాన్‌ ఇండియా వంటి పలు హిందీ సీరియళ్లలో ఆమె నటించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు